Importance-and-history-behind-telangana-state-formation-day


రాష్ట్రాల పునర్విభజన కమిషన్ 1953 సిఫార్సులను అనుసరించి నాటి హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోనూ, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను విలీనం చేశారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు తర్వాత ప్రజాభిప్రాయం ప్రకారం విధానసభలో తీర్మానానికి మూడింట రెండువంతుల ఆధిక్యత వస్తే వీలీనం జరపాలని సూచించింది. అయితే, నాటి కేంద్ర ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణకు భద్రతను కల్పించడానికి కొన్ని షరతులను విధించారు. దీని 1956, నవంబరు 1 న ఆంధ్ర, తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
పోలీస్‌ యాక్షన్‌ తర్వాత హైదరాబాద్‌ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్‌ అధికారుల పాలనలో ఉండటంతో ఆంధ్ర ప్రాంతంనుంచి వలసలు కొనసాగాయి. బ్రిటీష్‌ వారి శిక్షణలో అనుభవం ఉన్న ఆంధ్ర అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. నాటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి వలసవాదులకు ఉద్యోగాలు కల్పించారు. ఇక, 1956లో ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూవచ్చాయి. పెద్దమనుషుల ఒప్పందాన్ని గాలికొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలైన ఉద్యమం క్రమంగా తెలంగాణ అంతటా వ్యాపించింది. నాటి ఉద్యమంలో దాదాపు 370 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమ ఫలితంగా 1971లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా విద్య, ఉద్యోగాల్లో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.

ప్రత్యేక తెలంగాణ కోరుతూ 50 ఏళ్లుగా ఉద్యమాలు కొనసాగినా, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తీవ్ర రూపం దాల్చింది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే, స్వరాష్ట్రం కోసం 2009 డిసెంబరు 3న ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి. 

ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణసమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలని రూపొందించారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పుకోదగినవి. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వమి 2009 డిసెంబరు 9 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని 

అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనపై సీమాంధ్రులు నిరసనలు తెలిపి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా ఎట్టకేలకు 2014 ఫిబ్రవరిలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించింది.

దీంతో 2014 జూన్ 2న దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. 2019 జూన్ 2 నాటికి ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఆరో ఏడాదిలోకి అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. దేశ చరిత్రలోనే అపూర్వ మహోద్యమాన్ని సాగించి సాధించుకున్న తెలంగాణ ప్రగతి పథంలో పరుగులుపెడుతోంది. అన్ని రంగాల్లో

ఆదర్శంగా నిలుస్తోంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు లాంటి, కంటి పరీక్షలు లాంటి పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. మిషన్ భగరథతో ప్రజలకు తాగు, సాగు నీరు,

మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ చేపట్టింది. పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. 
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం 

తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Comments

Popular posts from this blog

Rajasthan BSTC Admit Card 2020 : राजस्थान प्री डीएलएड के एडमिट कार्ड जारी, ये रहा Direct Link

என்ன சொல்லி என்னை நானே தேற்றிக் கொள்வது?!'- தி.மு.க தலைவர் ஸ்டாலின் உருக்கம் #Anbazhagan

Salman Khan के फैंस को ट्विटर पर ख़ूब धो रहे हैं सिंगर-म्यूज़िशियन अमाल मलिक, जानिए वजह