టాటా ట్రస్ట్.. సాయం రూ.500 కోట్లు
ముంబై: మహమ్మారిగా మారిన కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న
చర్యలకు మద్దతుగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖులు సహాయ నిధులకు తమవంతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా కరోనాపై పోరుకు టాటా ట్రస్ట్ రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
టాటా ట్రస్ట్, టాటా గ్రూప్ కంపెనీల తరఫున రూ. 500 కోట్లను కేటాయించినట్లు టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా వెల్లడించారు..
కోవిడ్-19 సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యవసర వనరులను సమకూర్చుకోవలసిన అవసరం ఉందని ఛైర్మన్ రతన్ టాటా చెప్పారు. గతంలో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మేము అండగా నిలిచాం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ గతంలో కన్నా |
ఎక్కువగా మద్దతుగా నిలవాల్సి ఉందని రతన్ టాటా ట్వీట్ చేశారు. ఈ నిధులను వైద్యులకు అవసరమైన పీపీఈలు, కరోనా కేసులు పెరిగితే చికిత్స కోసం వినియోగించే శ్వాససంబంధ పరికరాలు, టెస్టింగ్ కిట్ల కొనుగోలు, హెల్త్ వర్కర్ల శిక్షణ కోసం ఉపయోగిస్తామన్నారు.
Comments
Post a Comment