కరోనాపై పోరాటం: రూ. 500 కోట్లు సాయం ప్రకటించిన రతన్ టాటా

కరోనాపై పోరాటం కోసం భారత్‌లోని బిలియనీర్లు, ప్రముఖ వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. కోవిడ్-19ను అరికట్టడం కోసం టాటా ట్రస్ట్స్ రూ.500 కోట్లు సాయం చేస్తుందని పారిశ్రామిక వేత్త రతన్ టాటా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘తీవ్ర ఇబ్బందికరమైన ఈ పరిస్థితుల్లో కరోనాపై పోరాటం కోసం అత్యవసర సాయం అవసరం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత కఠినమైన సవాల్ ఇదే’ అని రతన్ టాటా తెలిపారు.


కరోనా ప్రభావానికి గురైన అన్ని వర్గాలకు సాయం చేస్తామని, వారి సాధికారికతకు టాటా ట్రస్ట్స్ కృషి చేస్తుందని రతన్ టాటా తెలిపారు. వైద్య సిబ్బందికి మాస్కులు లాంటి రక్షణ సామాగ్రిని అందించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్న ఆయన.. టెస్టింగ్ కిట్లను, రెస్పిరేటరీ సిస్టమ్‌లను అందిస్తామన్నారు. కరోనాకు గురైన వారికి చికిత్స అందించే సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. హెల్త్ వర్కర్లు, సామాన్య ప్రజలకు శిక్షణ ఇపిస్తామన్నారు.
ఇప్పటికే పారిశ్రామిక వేత్తలైన ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, అనిల్ అగర్వాల్ తదితరులు కరోనాపై పోరాటానికి తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా.. మరణాల సంఖ్య 30 వేలకు చేరువలో ఉంది.


Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Comments

Popular posts from this blog

Rajasthan BSTC Admit Card 2020 : राजस्थान प्री डीएलएड के एडमिट कार्ड जारी, ये रहा Direct Link

என்ன சொல்லி என்னை நானே தேற்றிக் கொள்வது?!'- தி.மு.க தலைவர் ஸ்டாலின் உருக்கம் #Anbazhagan

Salman Khan के फैंस को ट्विटर पर ख़ूब धो रहे हैं सिंगर-म्यूज़िशियन अमाल मलिक, जानिए वजह